గాదె కిషోర్‌కు మాతృ వియోగం 

0
192
రాజమహేంద్రవరం, 13 జూలై : వెటరన్‌ గోల్ఫ్‌ క్రీడాకారులు గాదె కృష్ణ మూర్తి సతీమణి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రివర్‌ సిటీ సీనియర్‌ ప్రతినిధి గాదె కిషోర్‌ మాతృమూర్తి ప్రియాంక అశిత వ్యాలి స్కూల్‌ వ్యవస్థాపకురాలు గాదె లలిత (82) ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దేశంలో అత్యుత్తమ ఫ్రీ స్కూల్స్‌లో ఒకటిగా నగరంలోనే ఉత్తమ విద్యాసంస్థగా పేరొందారు. మానవతావాదిగా లలిత అందరికీ సుపరిచితురాలు 26 ఏళ్ల కిందట ఆమె అమెరికా పర్యటనలో ఫ్రీ స్కూల్‌ విధానాన్ని పరిశీలించి పిల్లలకు మంచి వాతావరణంలో, స్ఫూర్తిదాయకంగా విద్యను బోధిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదిగా ఉండే విధంగా ఫ్రీ స్కూల్‌ను లలిత ప్రారంభించారు. ఎంఎ లిటరేచర్‌ ఆంగ్లంలో పూర్తి చేసిన ఆమె రాజమహేంద్రవరంలో లేడిస్‌ క్లబ్‌ కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా పనిచేసి ఆ పదవులకే వన్నె తెచ్చారు.  దివంగత లలిత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ బంధువులు. నగరంలోని ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, పలువురు వారి నివాసానికి వచ్చి సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here