సమస్యల పరిష్కారం కోసం ఓపెన్‌ ఫోరమ్‌

0
189
రాజమహేంద్రవరం, ఆగస్టు 10 : గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ (గుడా) పరిధిలోని భవన నిర్మాణ, లే అవుట్ల  అనుమతులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం గుడా కార్యాలయంలో ఈరోజు ఓపెన్‌ ఫోరమ్‌ నిర్వహించారు. కాకినాడలోని ఎన్‌ఎఫ్‌సి రోడ్‌లో ఉన్న గుడా కార్యాలయంలో చైర్మన్‌ గన్ని కృష్ణ, వైస్‌ చైర్మన్‌ అమరేంద్రకుమార్‌, కార్యవర్గ సభ్యులు వినతులు స్వీకరించారు. భవన నిర్మాణ యజమానులు , స్థల యజమానులు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుడా డైరెక్టర్‌ గట్టి సత్యనారాయణ, ప్లానింగ్‌ ఆఫీసర్‌ సంజయ్‌, అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here