కార్యకర్తల శ్రమకు బిజెపీలో గుర్తింపు

0
118
రేలంగి శ్రీదేవి సత్కార సభలో ఎమ్మెల్సీ సోము
రాజమహేంద్రవరం,ఆగస్టు 11 : పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందనడానికి కార్పొరేటర్‌  రేలంగి శ్రీదేవి ఒక ఉదాహరణ అని ఎమ్మెల్సీ, బిజెపి జాతీయ కమిటీ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా రేలంగి శ్రీదేవి నియమితురాలైన సందర్భంగా బిజెపి అర్బన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉదయం వై జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో ఘన సత్కారం జరిగింది. ముందుగా ఆమె స్వగృహం క్వారీ ప్రాంతం నుంచి పార్టీ శ్రేణులు, నాయకులతో కలిసి కోరుకొండ రోడ్డు మీదుగా బ్రదరన్‌ చర్చ్‌, కంబాలచెరువు మీదుగా వై-జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలు వరకూ ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జరిగిన సత్కార సభకు బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించి పార్టీ నిర్మాణంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన రేలంగి శ్రీదేవిని పార్టీ గుర్తించి సరైన స్థానాన్ని ఇచ్చిందన్నారు. ఇప్పటికే డివిజన్‌ స్థాయిలో కార్పొరేటర్‌గా అవకాశం కల్పించిందని, అలాగే పార్టీలో అంచెలంచెలుగా అర్బన్‌ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా ఆమె పనిచేశారని అన్నారు. పార్టీ నిర్మాణానికి ఆమె చేస్తున్న కృషిని పార్టీ నాయకత్వం గుర్తించి ఆమెను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేశారని తెలిపారు. ఈ సందర్భంగా రేలంగి శ్రీదేవిని పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ధార్యాడ రామకృష్ణ,అడబాల రామకృష్ణారావు, సవితాల చక్రభాస్కరరావు, బూరా రామచంద్రరావు, యెనుమల రంగబాబు, ఆకుల శ్రీధర్‌, కెవిఎం కృష్ణ, వీర వీరాంజన్‌రావు, కాలెపు సత్య సాయిరామ్‌, కేతిరెడ్డి ఆదిత్య, రుక్మంధారావు, తంగెళ్ల పద్మావతి, తంగెళ్ల శ్రీనివాసు, రాయుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here