ఏకత్రాటిపైకి బ్లడ్‌ బ్యాంక్‌లు 

0
63
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 25 : బ్లడ్‌ బ్యాంక్‌లను ఐక్యపరిచి వాటి నిర్వహణలో ఉండే ఇబ్బందులను తొలగిస్తూ డాక్టర్లకు, టెక్నిషియన్స్‌కు అధునాతన విధానాలను తెలియజేసేందుకు ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ అండ్‌ ఇమ్యూనో హిమటాలజీ సంస్ధ పనిచేస్తుందని ఆ సంస్ధ  జాతీయ డిప్యూటీ ప్రెశిడెంట్‌ ఎం.సతీష్‌కుమార్‌ తెలిపారు. ¬టల్‌ ఆనంద్‌రీజెన్సీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంస్ధను అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసే విధంగా కమిటీలు వేస్తున్నామని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ధన్వంతరి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకులు డా. కె.శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్షులుగా విశాఖపట్టణానికి చెందిన డా.ఎ.సుగంధి, నెల్లూరుకు చెందిన డా.ఐఎస్‌ చైతన్యకుమార్‌, ప్రధాన కార్యదర్శిగా నెల్లూరుకు చెందిన డా.ఎ.యశోవర్ధన్‌, కోశాధికారిగా ప్రభుత్వాసుపత్రికి చెందిన జి.సూర్యనారాయణ నియమితులయ్యారని తెలిపారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్ధ అని, రక్తం అవసరాన్ని, రక్తదానంపై ఉన్న అపోహలను తొలిగించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. 2018లో జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  సురక్షితమైన రక్తాన్ని అందించేందుకు టెక్నిషియన్స్‌కు అవగాహన కల్పిస్తామని, జాతీయ రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డా. కె .శ్రీనివాసమూర్తి, డా. ఎ.యశోవర్ధన్‌, జి.సూర్యనారాయణ పాల్గొన్నారు.