37వ డివిజన్‌లో  నగర దర్శిని 

0
76
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 15:  రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం  సీఎం చంద్రబాబునాయుడికి  ప్రలంతా అండగా ఉండాలని రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌, ఎం.ఎల్‌.సి.ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్ధానిక 37 వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ నగర దర్శిని కార్యక్రమాన్ని డివిజన్‌  కార్పొరేటర్‌ పెనుగొండ విజయభారతి రామకృష్ణ ఆధ్వర్యంలో  నిర్వహించారు. లలితా నగర్‌ వినాయకుని గుడి వద్ద లలితా నగర్‌ 4,5 వీధులలో లోని గృహాలను సందర్శించి స్ధానికులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో ఆరా తీశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెదేపా అని, రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ కోరిమిల్లి విజయ శేఖర్‌, కార్పొరేటర్‌ తంగెళ్ళ బాబి,ఆశపు సత్యనారాయణ, డివిజన్‌ కమిటీ,ఆర్‌.పిలు జన్మభూమి కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here