కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ఎంపి ల్యాడ్స్‌ నిధులు 

0
189
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 16 : స్థానిక 42వ డివిజన్లో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ ప్రక్కన ఉన్న నగరపాలక సంస్థ స్థలంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ తన ఎంపి ల్యాండ్స్‌ నుంచి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపి మురళీమోహన్‌తో గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, 42వ డివిజన్‌ కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  కొద్దిసేపు పార్టీ విషయాలను చర్చించుకున్నారు. కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని, నగరపాలక సంస్ధ నుంచి అనుమతులు తీసుకోవాలని ఎంపి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here