ఫార్మశీ కళాశాలల విద్యార్ధుల ర్యాలీ 

0
90
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 26 :  ప్రపంచ ఫార్మశీ డే సందర్భంగా విద్యార్ధులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. విజె ఫార్మశీ కళాశాల, వికాస్‌ ఫార్మశీ కళాశాల, గైట్‌ కళాశాలకు చెందిన విద్యార్ధులు పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్య మైదానానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గోకవరం బస్టాండ్‌, దేవీచౌక్‌, కంబాలచెరువు మీదుగా వై జంక్షన్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యాధులు పెరుగుతున్న నేటి తరుణంలో ఫార్మశీ విద్య అవసరం పెరుగుతోందని,  ఈ కోర్సు పూర్తి చేసి మందులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఫార్మశీ కౌన్సిల్‌ డైరక్టర్‌ దారపు ప్రసాదరెడ్డి, వికాస్‌ ఫార్మశీ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ డా.సుమలత, ఏఓ టి.ఉదయ్‌భాస్కర్‌, బి.బాలాజీ, విజె ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యాధర్‌, గైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ధనరాజ్‌ పాల్గొన్నారు.