పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించిన కార్పొరేటర్‌

0
39
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 27 : స్ధానిక 31 వ డివిజన్‌ అన్నపూర్ణమ్మపేట, మదన్‌సింగ్‌పేటలో ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, నగర పాలక సంస్ధ శానిటేషన్‌ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన ఆవశ్యకతపై ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఇళ్ళ పరిసరాల్లో నీరు నిల్వ ఉండరాదని, ఇంటిలోని చెత్తను కార్పొరేషన్‌ సిబ్బంది వచ్చినప్పుడు అందజేయాలని,  కాలువల్లో చెత్త వేయరాదని, దోమలు రాకుండా ఇళ్ళ కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధులు దరిచేరవని అన్నారు.ఈ కార్యక్రమంలో నగర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావు, శానిటేషన్‌ సూపర్వైజర్‌ నారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.