ధవళేశ్వరంలో గురుపూజోత్సవం

0
64
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 27 : బిజెపి రూరల్‌ మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల ధవళేశ్వరంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో  పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్రావ్‌,  అసెంబ్లీ కన్వీనర్‌ ఒంటెద్దు స్వామి, మండల అధ్యక్షుడు యానాపు ఏసు, ప్రధాన కార్యదర్శి కోన సతీష్‌, యువమోర్చా నాయకులు కందుకూరి మనోజ్‌, మండల అధ్యక్షుడు పృధ్వీరాజ్‌ చౌదరి, ఎస్‌కె సాజిద్‌, వీణం సందీప్‌, పన్నాల వెంకటలక్ష్మీ, జివిఎస్‌ లక్ష్మీ తులసి, రొంగల గోపి శ్రీనివాస్‌, కొంపెల్ల గంగరాజు పాల్గొన్నారు.