కరాటే పోటీల్లో నగర విద్యార్ధుల ప్రతిభ

0
62
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 28 : ఆల్‌ ఇండియా లెవెల్‌ ఓపెన్‌ ఆల్‌ స్టైల్స్‌ కుంగ్‌ఫూ అండ్‌ కరాటే పోటీల్లో నగరానికి చెందిన ఐదుగురు విద్యార్ధులు గో ల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ సాధించి తమ ప్రతిభ ప్రదర్శించారు. దానవాయిపేట మున్సిపల్‌ హైస్కూలులో  ఏడవ తరగతి చదువుతున్న  వడ్డాది ఆకాష్‌కుమార్‌, పవర్స్‌ స్కూలులో ఆరవ తరగతి చదువుతున్న వడ్డాది రామ్‌చరణ్‌తేజ, అదే స్కూలులో రెండవ తరగతి చదువుతున్న వడ్డాది సాల్మన్‌రాజు గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. అలాగే ఎస్‌కెవిటి  స్కూలులో ఆరవ తరగతి చదువుతున్న బి.ప్రణయ్‌ తేజ కరాటే అండ్‌ కుంగ్‌ఫూ పో టీల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించగా అదే స్కూలులో నాల్గవ తరగతి చదువుతున్న బి.వర్షిత్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించారు. హైదరాబాద్‌లో ఈ నెల 25న కుంగ్‌ఫూ మార్షల్‌ ఆర్ట్సు అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఇండియా లె వెల్‌ ఆల్‌ స్ట్లెల్స్‌ కుంగ్‌ఫూ అండ్‌ కరాటే జాతీయ స్థాయి పోటీలో ్ల పాల్గొన్న ఐదుగురు విద్యార్ధులు మెడల్స్‌ సాధించారు. విక్టోరియా డబుల్‌ డ్రాగన్‌ కుంగ్‌ఫూ మార్షల్‌ ఆర్ట్సు గ్రాండ్‌ మాష్టర్‌ ఎస్‌ వలి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి పోటీల్లో పాల్గొన్నారు.