మారిశెట్టి సేవలు మార్గదర్శకం 

0
95
గ్రంథాలయ సంస్ధ కార్యదర్శి సత్యనారాయణ సత్కార సభలో వక్తలు 
 
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 29 : గ్రంథాలయాలను అభివృద్ధి పథంలో నడిపించిన మారిశెట్టి సత్యనారాయణ సేవలు జిల్లా స్థాయికి విస్తరించడం ఆనందకరమని, పట్టుదల, అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు ఉన్నందునే జిల్లా గ్రంథాలయ సంస్థ  కార్యదర్శిగా పదోన్నతి పొందారని జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి  అన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, సిసిసి చానల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ పంతం కొండలరావు ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా పదోన్నతి పొందిన మారిశెట్టికి ఈరోజు కృష్ణనగర్‌లోని మెడికల్‌ అసోషియేషన్‌ హాలులో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లమిల్లి వీర్రెడి ్డ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించాక కార్యదర్శి పదవీ ఖాళీ అయిందని, ఆ స్ధానంలో ఎవరిని నియమించాలని ఆలోచించినప్పుడు  అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు పొందిన మారిశెట్టి పేరు వినిపించిందన్నారు. తన జీవితాన్ని గ్రంథాలయానికి  అంకితం చేశారని  అన్నారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణుల డా.కర్రి రామారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం పవిత్రమైన స్ధలంగా భావించాలని, అందులో పనిచేసే ఉద్యోగులు  సంస్కారవంతంగా ఉంటారన్నారు.సాహితీవేత్త ఫణి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో మారిశెట్టి పట్టుదల కలిగిన వ్యక్తి అని, తోటి ఉద్యోగులకు ఆయన మార్గదర్శి అని కొనియాడారు. చిలకమర్తి పౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘనాధ్‌ మాట్లాడుతూ ఔన్నత్యం, అంకితభావం, సామాజిక స్పృహ కలిగిన  మంచి ఉద్యోగి మారిశెట్టి అని అభినందించారు. సీజిటిఎం కళాశాల కరస్పాండెంట్‌ ఎఎస్‌ఆర్‌ ప్రభు మాట్లాడుతూ సీతంపేట గ్రంథాలయం అభివృద్ధిలో పంతం కొండలరావు, మారిశెట్టి సత్యనారాయణ కృషి అభి నందనీయమన్నారు. ఆదిత్య విద్యా సంస్ధల డైరక్టర్‌ ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పత్రికలు, వివిధ రచనలను అందుబాటులో ఉంచడంతో పాటు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చి గ్రంథాలయం అభివృద్ధిలో మారిశెట్టి కృషి మరువలేనిదన్నారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ మారిశెట్టి ఉద్యోగులకు మార్గదర్శకులని అన్నారు. డా. అరిపిరాల నారాయణరావు మాట్లాడుతూ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూ జీతంలో కొంత గ్రంథాలయ అభివృద్ధికి వెచ్చిస్తూ అందరి మన్ననలు అందుకున్న మారిశెట్టి అభినందనీయులన్నారు. సిసిసి ఎం.డి. పంతం కొండలరావు మాట్లాడుతూ ఉద్యోగ ధర్మానికి న్యాయం చేస్తూ మరో వైపు ఇతర గ్రంథాలయాల్ని కూడా అభివృద్ధి పరిచే దిశగా మారిశెట్టి ఎంతో కృషి చేశారని అన్నారు. ఉద్యోగులకు మార్గదర్శకులుగా ఉన్న ఆయనను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని, ఆయన విలువైన సేవలు జిల్లాకు విస్తరించడం శుభపరిణామమన్నారు. మాజీ చైర్మన్‌ బైర్రాజు ప్రసాదరాజు మాట్లాడుతూ మారిశెట్టి వంటి ఉద్యోగులు ఉండే సంస్ధలు అభివృద్ధి పధంలో సాగుతాయన్నారు. అనంతరం మారిశెట్టిని అతిధులు, వక్తలు ఘనంగా సత్కరించారు.