చారిత్రక నగరంలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా  

0
90
కేంద్ర మంత్రిని కోరిన ఎంపి మురళీమోహన్‌
 
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 29 : నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా సెంటర్‌ను త్వరలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్‌ శర్మ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఎంపి మాగంటి మురళీమోహన్‌  తనను కలిసి చేసిన విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సాంస్కృతిక కేంద్రంగా పేరెన్నికగన్న రాజమహేంద్రవరంలో ఈ సెంటర్‌ ఏర్పాటు చేస్తే నాటక కళకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. అలాగే పాత రైలు వంతెన  (హేవ్‌లాక్‌)ను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడానికి చర్యలు చేపట్టాలని కూడా మురళీమోహన్‌ కోరగా రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.5 కోట్లు చెల్లిస్తే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం మురళీమోహన్‌ రైల్వే మంత్రి సురేష్‌ ప్రభును కలిసి గోదావరిపై ఉన్న మూడవ వంతెనపై రెండవ ట్రాక్‌ నిర్మాణం చేపట్టాలని కోరగా వచ్చే బడె ్జట్‌లో కేటాయింపులు చేస్తామని రైల్వే మంత్రి తెలిపారు. ఇక కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ను కలిసి రాజమహేంద్రవరంలో హార్టికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని   కోరారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 10  ఎకరాల భూమిని కేటాయించిందని  ఆయన గుర్తు చేశారు.