కొత్తగా కడదామా? వేరే చోట నిర్మిద్దామా?

0
129
చాంబర్‌ భవనంపై సర్వసభ్య సమావేశంలో చర్చ
 
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 29 : చాంబర్‌ భవనం పునర్నిర్మాణ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాలని పలువురు వర్తక ప్రతినిధులు సూచించారు. ది రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సర్వసభ్య సమావేశం ఈరోజు అధ్యక్షులు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి చాంబర్‌ పూర్వాధ్యక్షులు మారిశెట్టి వెంకట రామారావు,అశోక్‌కుమార్‌ జైన్‌, బొమ్మన రాజ్‌కుమార్‌, నందెపు శ్రీనివాస్‌, బాలనాగు బలేష్‌గుప్తా, గౌరవ కార్యదర్శి కాలెపు రామచంద్రరావు, కోశాధికారి క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్‌, ఉపాధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, సంయుక్త కార్యదర్శి వెత్సా బాబ్జీ, డైరక్టర్లు మామిడి వెంకట్రాజు, కనకాల రాజా, యెక్కల వీర నాగేశ్వరరావు, పుచ్చల రామకృష్ణ, వేమన సురేష్‌కుమార్‌, పొట్లూరి రామ్మోహనరావు, బత్తుల శ్రీరాములు, వర్తక ప్రతినిధులు కోసూరి సుబ్బరాజు, అసదుల్లా అహ్మద్‌, గమిని రంగయ్య, గ్రంధి పిచ్చయ్య, దేవత సుధాకర్‌, చలం, ఎన్‌విఆర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల డిపాజిట్‌ సొమ్ము రెట్టింపు, చాంబర్‌ భవన పునర్నిర్మాణం, ఆదాయ వ్యయాల ఆమోదం తదితర అంశాలను చర్చించారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించుకో వడం మంచిదని పలువురు అన్నారు. అలాగే  ఈ భవన స్ధలాన్ని విక్రయించి ఆ సొమ్ముతో మరో ప్రాంతంలో స్ధలాన్ని కొనుగోలు చేసి భవనాన్ని నిర్మించడంపై కూడా చర్చించారు. ఎన్నికల సమయంలో చాంబర్‌కు సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్‌ పత్రాలకు రుసుము వసూలు చేసే అంశంపై చర్చించారు.