హస్తకళలను ప్రోత్సహించాలి

0
49
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : హస్తకళలను ప్రోత్సహించాలని సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లేపాక్షి ఎగ్జిబిషన్‌ – 2016 ప్రదర్శన, అమ్మకాలను ఈరోజు సబ్‌ కలెక్టర్‌ ప్రారంభించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి హస్త కళాకారులు వస్తువులు తయారు చేస్తున్నారని, వారు నేరుగా విక్రయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. లేపాక్షి మేనేజర్‌ షేక్‌ సిరాజుద్దీన్‌ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో ఎన్నో రకాల హస్తకళా వస్తువులను అందుబాటులోకి తెచ్చామని, వచ్చేనెల 11 వరకు ఈ ప్రదర్శన నిర్వహించబడుతుందన్నారు. నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి హస్త కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.