చీపురు చేతపట్టిన సబ్‌ కలెక్టర్‌ 

0
116
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 1 : దోమలపై దండయాత్రలో భాగంగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణాన్ని సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ స్వయంగా చీపురు చేతబట్ట శుభ్రపర్చారు. చెత్తా చెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యాలయ ప్రాంగణాన్ని దోమల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. దోమల్ని నివారిస్తే వ్యాధులను కూడా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.