శ్రీకన్య గ్రాండ్‌ అధినేత సూర్యనారాయణరాజుకు స్వర్ణాంధ్ర సత్కారం  

0
163
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 3 : రుచి,శుచితో పాటు అందరినీ ఆపాయ్యంగా ఆహ్వానిస్తూ గోదావరి రుచులతో ఆతిధ్యం అందిస్తున్న శ్రీకన్య గ్రాండ్‌ అధినేత వి.సూర్యనారాయణరాజు సేవలు ఆదర్శనీయమని స్వర్ణాంధ్ర  గౌరవ అధ్యక్షులు తుమ్మిడి అరుణ్‌కుమార్‌ అన్నారు. ఇటీవల నగర పాలక సంస్ధ నుంచి బెస్ట్‌ శానిటేషన్‌ అవార్డు అందుకున్న సూర్యనారాయణరాజును స్వర్ణాంధ్ర  అధ్యక్షులు  రుంకాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్‌ గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో శ్రీకన్య గ్రాండ్‌లో ఈరోజు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రుంకాని మాట్లాడుతూ జిల్లా ప్రజానీకానికి మంచి రుచులతో పాటు కొత్త హంగులతో శ్రీకన్య గ్రాండ్‌ను తీర్చిదిద్దిన సూర్యనారాయణరాజు అభినందనీయులన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సూర్యనారాయణరాజు నాణ్యమైన రుచులతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బొప్పన వంశీకృష్ణ, షేక్‌ షంషేర్‌,షబ్బీర్‌ అహమ్మద్‌ పాల్గొన్నారు.