జయ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి

0
87
తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
చెన్నై, అక్టోబర్‌ 4: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తీవ్రమైన జ్వరం, డీహ్రైడేషన్‌తో బాధ పడుతూ గత నెల 21 న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత ఆరోగ్యంపై అటు ప్రభుత్వం గాని, ఆసుపత్రి వర్గాలు కాని ఇంతవరకు ఎలాంటి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయకపోవడంతో ఆమె ఆరోగ్యంపై ప్రజల్లో, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడించాలని అభిమానులు, ఎఐఏడిఎంకె కార్యకర్తలు డిమాండ్‌ చేస్తుండగా ప్రభుత్వం నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. జయ క్రమంగా కోలుకుంటున్నారని, ఆమె ఇంకా ఆసుపత్రిలోనే ఉండవలసిన పరిస్థితి ఉందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ నేపధ్యంలో జయ ఆరోగ్య వివరాలను బహిర్గత పర్చాలని కోరుతూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్ధానం రేపటిలోగా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల చేయాలని ఆదేశించింది. మొత్తం మీద జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అందరిలోనూ  ఉత్కంఠ నెలకొంది.