మొక్కల సంరక్షణ అందరి బాధ్యత 

0
61
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 5 : పర్యావరణం దెబ్బతినకుండా పచ్చదనం పెరిగే విధంగా ప్రతి ఒక్కరు మొక్కలను నాటి సంరక్షించాలని సబ్‌కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పేర్కొన్నారు. స్ధానిక రామకృష్ణ ధియేటర్‌ వెనుక ప్రభుత్వం నిర్మించిన గృహ సముదాయం ప్రాంతంలో సబ్‌కలెక్టర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యం కొరకు ప్రతి పౌరుడు సాధ్యమైనన్ని మొక్కలను ఖాళీప్రదేశాలలో నాటాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఖాళీ స్ధలాలలో తప్పని సరిగా సంబంధిత శాఖల అధికారులు మొక్కలు నాటే విధంగా బాధ్యతతీసుకోవాలని సూచించారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటే మానవ మనుగడకే ప్రమాదం కలుగవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ తహశీల్దార్‌ కె పోసియ్య, హౌసింగ్‌ ఇఇ జిహెచ్‌ శ్రీనివాసరావు, డిఇ సూర్యారావు, కుక్కల ప్రభాకరరావు పాల్గొన్నారు.