జాంపేట చేపల బజార్‌ వద్ద అన్న సమారాధన

0
77
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 7 : జాంపేట హోల్‌సేల్‌, రిటైల్‌ చేపల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ముఖ్యఅతిధులుగా పాల్గొని అన్న సమారాధనను ప్రారంభించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టిన ఉత్సవ కమిటీ సభ్యులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ రెడ్డి మణి, సంఘ గౌరవాధ్యక్షులు గొర్రెల రమణ, అధ్యక్షులు అక్కల కోటేశ్వరరావు, కార్యదర్శి ముసిని నాగు, ఉపాధ్యక్షులు సిహెచ్‌.యల్లయ్య, సంయుక్త కార్యదర్శులు ఎం.కనకయ్య, వి.నారాయణరావు, సభ్యులు వి.రాజు, కె.ప్రభు, సిహెచ్‌.లక్ష్మి, అక్కల సత్యవతి, గొల్లా అచ్చాయమ్మ, అశోక్‌, సిహెచ్‌.లోవరాజు, సిహెచ్‌.అప్పారావు, కె.కృష్ణ, వై.రమేష్‌, ఎం.నాగమ్మ, ఎం.రామకృష్ణ, ఎల్‌.వి.ఎం.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.