పిడింగొయ్యిలో గడపగడపకు వైఎస్సార్‌

0
64
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 7 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన గడపగడపకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాన్ని నేడు రూరల్‌ నియోజకవర్గం పిడింగొయ్యి గ్రామంలో రూరల్‌ ఇన్‌ఛార్జి ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వైసిపి నాయకులు ఇంటింటికి వెళ్ళి గడిచిన రెండున్నరేళ్ళలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యాలను, 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారో వైఎస్సార్‌ పార్టీ ప్రజా బ్యాలెట్‌ పంచి చంద్రబాబు నాయుడు పాసా, ఫెయిలా తెలపాలని కోరారు. పలువురు మహిళలు డ్వాక్రా రుణాలు కట్టవద్దనడంలో రుణాలు కట్టలేదని, ఇప్పుడు వడ్డీతో సహా కలిపి కట్టాల్సిందిగా తాఖీదుల వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణించి 4 సంవత్సరాలు అయినా వితంతు పింఛను రాలేదని పంచకట్ల లక్ష్మి వైసిపి నేతల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో తెల్లమేకల సత్యనారాయణ, బొప్పన సుబ్బారావు, దాసరి శివ, పంచకట్ల మాధవ నాగేశ్వరరావు, తెల్లమేకల పెద్ద వెంకటరావు, పంచకట్ల పెద్ద వీర్రాజు, చిటికిన నాగప్రసాద్‌, పంచకట్ల గోవింద్‌, బాతులా శ్రీను, తెల్లమేకల సూర్యకృష్ణ, తెల్లమేకల ప్రేమ్‌కుమార్‌, చిచ్చర చంటి యాదవ్‌, తెల్లమేకల బాపిరాజు, సూర్యారావు, రెడ్డిబాబు, కాకరపల్లి అప్పారావు, పగడం లక్ష్మణరావు, మీగడ గంగాధరం, బొబ్బిలి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.