8,9 తేదీల్లో సుమన్‌ ఉభయ గోదావరి జిల్లా పర్యటన

0
70
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 7, ప్రముఖ సినీనటుడు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ గౌరవ సలహాదారులు హీరో సుమన్‌ అక్టోబర్‌ 8,9 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తారని స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డా|| గుబ్బల రాంబాబు తెలిపారు. 8వ తేదీన రాజమండ్రికి విచ్చేస్తున్న సుమన్‌ కాకినాడలోని వివిధ సామాజిక సేవా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లనున్నట్టు తెలిపారు. 9 తేదీన కీ||శే|| జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతిలో జరిగే పలు సేవా కార్యక్రమాలల్లో పాల్గొంటారు. సుమన్‌ పర్యటనను విజయవంతం చేయాలని  స్వర్ణాంధ్ర రాంబాబు కోరారు.