ఆదిత్య జూనియర్‌ కాలేజ్‌కి బహుమతులు

0
65
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 10 : రోటరీ క్లబ్‌ వారు  సెప్టెంబర్‌ మాసోత్సవం సందర్భంగా విద్యార్ధులకు మూడు అంశాలపై నిర్వహించిన పోటీలలో ఆదిత్య జూనియర్‌ కాలేజి విద్యార్ధులు బహుమతులు సాధించారని ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎస్‌.పి.గంగిరెడ్డి తెలిపారు. శాస్త్రీయ కూచిపూడి నృత్య పోటీలలో సీనియర్‌ ఇంటర్‌ విద్యార్ధి సి.వి.ఎస్‌.అనిరుధ్‌ గౌడ్‌ ప్రథమ బహుమతిని, చిత్రలేఖనం పోటీలో జూనియర్‌ ఇంటర్‌ విద్యార్ధిని జి.శ్రీనిజ ద్వితీయ బహుమతిని, అన్నమాచార్య కీర్తనల పోటీలో ఎం.బిందు కన్సొలేషన్‌ బహుమతిని గెలుపొందారని కళాశాల ప్రిన్సిపాల్‌ పి.సత్యనారాయణ తెలిపారు. తమ విద్యార్ధులు ఆనం రోటరీ హాలులో జరిగిన సభలో ముఖ్యఅతిధి గన్ని కృష్ణ చేతులమీదుగా పట్టపగలు వెంకట్రావు, ఆదిత్య డైరెక్టరు గంగిరెడ్డి సమక్షంలోబహుమతులు అందుకున్నారని వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. విజేతలను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, సెక్రటరీ ఎన్‌.కె.దీపక్‌రెడ్డి, డైరెక్టరు గంగిరెడ్డి, ప్రిన్సిపల్‌ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.