డివైడర్‌ను  ఢీకొట్టి బోల్తాపడ్డ బొలేరో

0
150
భవానీ భక్తుల యాత్రలో విషాదం – ఒకరు మృతి – 20 మందికి గాయాలు – మోరంపూడిలో ఘటన
 
రాజమహేంద్రవరం, అక్టోబరు 12 : విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్న భవానీ భక్తుల యాత్రలో విషాదం అలుముకుంది. అనకాపల్లి నుంచి  విజయవాడ వెళుతున్న భవానీ భక్తుల బొలేరో వాహనం మోరంపూడి జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో లోకేష్‌ (16) అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారం మేరకు ప్రకాశంనగర్‌ పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.