బాలునికి ఆపరేషన్‌ చేయించిన ఆదిరెడ్డి

0
144
రాజమహేంద్రవరం, అక్టోబరు 12 : స్థానిక సిమెంటరీ పేటకు చెందిన టేకేటి ప్రేమ్‌కుమార్‌ చిన్న నాటి నుంచి యూరిన్‌ బ్లేడర్‌ సమస్యతో బాధపడుతూ ప్రాణాంతకం దశకు చేరుకున్నాడు. ఆపరేషన్‌ చేయించుకునే ఆర్థిక స్థోమత ప్రేమ్‌కుమార్‌ తల్లిదండ్రులకు లేకపోవడంతో శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావును కలిశారు. దీంతో ఆదిరెడ్డి స్పందించి విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో బాలునికి ఆపరేషన్‌ చేయించారు. శస్త్ర చికిత్స అనంతరం నగరానికి చేరుకున్న ప్రేమ్‌కుమార్‌ ఈరోజు ఆదిరెడ్డి అప్పారావు నివాసానికి వెళ్ళారు. ప్రాణాపాయం నుంచి తన కుమారుడిని ఆదుకున్న ఆదిరెడ్డి అప్పారావును, యువ నాయకులు ఆదిరెడ్డి వాసును ప్రేమ్‌కుమార్‌ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.