ఆర్‌పిసి ఆధ్వర్యంలో ప్రత్యేక హొదా సాధన సదస్సులు

0
54
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హొదా కల్పించాలని డిమాండ్‌ చేయడంతోపాటు రాష్ట్ర ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సాధనా సదస్సులు నిర్వహిస్తామని ఆ పార్టీ రాజానగరం కన్వీనర్‌ కొత్తపల్లి భాస్కరరామ్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈనెల 20న రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ సుబ్రహ్మణ్యస్వామి కళావేదిక నుంచి సదస్సులు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని, మాట తప్పిన టిడిపి, బిజెపిలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా సదస్సుల గోడ పత్రికలను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో అడ్డాల వెంకటేశ్వరరావు, ఎస్‌.వెంకటరమణ, తాళాబత్తుల కాశీ విశ్వనాధ్‌, సూరిశెట్టి వెంకట పాండు రంగారావు, యేసు, పొట్నూరి అప్పలస్వామి, లంక దుర్గాప్రసాద్‌, బర్ల ప్రసాద్‌, దొడ్డి త్రినాధ్‌, పెండ్యాల కామరాజు, డి.వి.రమణమూర్తి, ఆర్‌.కె.చెట్టి, శ్రీనివాస్‌, కొల్లి సిమ్మన్న పాల్గొన్నారు.