శ్రీ వెంకటేశ్వర జనరల్‌ మార్కెట్‌లో శాంతి హోమాలు

0
48
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : స్థానిక శ్రీ వెంకటేశ్వర జనరల్‌ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర జనరల్‌ మార్కెట్‌లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా  విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, మూలస్వామికి పంచామృతాభిషేకము, లక్ష తులసి  పూజ, శాంతి హోమాలు అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  భక్తి సేవాతత్పరులు కొండవీటి జ్మోతిర్మయి విచ్చేసి భక్తి గీతాలను ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర జనరల్‌ మార్కెట్‌ కమిటీ గౌరవ అధ్యక్షులు మారిశెట్టి వెంకట రామారావు, అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, కార్యదర్శి గ్రంధి రామకృష్ణ, గౌరవ సలహాదారులు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మద్దాల రవిశంకర్‌, గ్రంధి పిచ్చియ్య కార్యక్రమాలను పర్యవేక్షించగా పసుమర్తి పెరుమాళ్ళు దంపతులు, పసుమర్తి శ్రీనివాసరావు దంపతులు, శ్రీవిద్యపు వెంకటరాజు దంపతులు, గ్రంథి రాము, శ్రీ మద్దాల రవిశంకర్‌ దంపతులు  పూజా కార్యక్రమములో పాల్గొన్నారు.