దేవీచౌక్‌ నవరాత్రి పూజలలో ఆదిత్య వాలంటీర్ల సేవలు

0
71
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : దేవీ నవరాత్రుల సందర్భంగా రాజమండ్రి దేవీచౌక్‌లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న  దేవీ నవరాత్రి ఉత్సవాలలో 40 మంది ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు 7వ తేదీ నుంచి సేవలందిస్తున్నారని ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టరు ఎస్‌.పి.గంగిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుంచి 9 గంటల వరకు తమ వాలంటీర్లు తన ప్రత్యక్ష పర్యవేక్షణలో భక్తులను క్యూలైన్లలో పంపిస్తూ మండపం వద్ద రద్దీ లేకుండా చూస్తూ, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తూ అక్టోబర్‌ 11వ తేదీ వరకు తమ వాలంటీర్లు సేవలందిస్తారని ఆదిత్య ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కో ఆర్డినేటరు జి.వి.ఎస్‌.నాగేశ్వరరావు తెలిపారు. ఆదిత్య వాలంటీర్ల సేవలను కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు భక్తులు అభనందించాలని ఆదిత్య కళాశాలల ప్రిన్సిపాల్స్‌ కె.సి.సాగర్‌, సి.ఫణికుమార్‌లు తెలిపారు.