కోటిలింగాలపేటలో గ్యాస్‌ కనెక్షన్‌ల పంపిణీ

0
51
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : స్థానిక 41వ డివిజన్‌ కోటిలింగాలపేటలో భారతీయ జనతాపార్టీ డివిజన్‌ అధ్యక్షులు నందివాడ సత్యనారాయణ, డివిజన్‌ ఇన్‌ఛార్జి వీరా వీరాంజనేయులు ఆధ్వర్యంలో సుమారు 70 మంది మహిళలకు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌లు భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ మహిళలు కట్టెల పొయ్యతో వంట చేస్తూ తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని, కనుక అందరికీ సబ్సిడీతో కూడిన గ్యాస్‌ పంపిణీ చేయడం కష్టసాధ్యం కనుక, సబ్సిడీ అవసరం లేకుండా స్థోమత కలిగి గ్యాస్‌ కొనుక్కోగలిగిన వారు స్వచ్చందంగా గ్యాస్‌ సబ్సిడీని వదులుకోవాలి గిప్‌ అప్‌ పిలుపునిచ్చారని, దీనికి సుమారు రూ.2కోట్లమంది స్పందించి గ్యాస్‌ సబ్సిడీని వదులుకొన్నారని ఇది చాలా మంచి పరిణామమని, దీనివల్ల మరింతమంది  పేదలకు సబ్సిడీతో కూడిన గ్యాస్‌ అందించగలుగుతున్నారన్నారు. పేదల కోసం ప్రధాని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వీటిని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ములదత్తు, బిజెపి కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, యెనుముల రంగబాబు, అర్బన్‌ జిల్లా మీడియా ఇన్‌ఛార్జి దాస్యం ప్రసాద్‌, బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు కొంతం కృష్ణ, బొమ్ముల చందు, పడాల నాగరాజు, తంగెళ్ళ శ్రీనివాస్‌, వరదా శ్రీను, నందివాడ సత్య, నిడిగట్ల రవి, ఎన్‌.రమేష్‌, పి.ఫణికుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.