ఏసివై రెడ్డికి ఘన నివాళి

0
74
 
 
రాజమహేంద్రవరం,  అక్టోబర్‌ 14 : మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర డ్రైనేజీ బోర్డు మాజీ చైర్మన్‌ దివంగత ఏసివై రెడ్డికి పలువురు నేతలు ఘనంగా నివాళులర్పిం చారు. ఏసివై 3వ వర్థంతి కార్యక్రమాన్ని అప్సరా హోటల్‌ స్థలంలో ఈరోజు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సిపి సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, వైఎస్సార్‌సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ నీలపాల తమ్మారావు, రాజేంద్రనగర్‌ సాయిరామ్‌ మందిరం అధ్యక్షులు వెలిగట్ల పాండురంగారావు, పిఏ నారాయణ,  కుక్కా తాతబ్బాయి, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.