జాతి గర్వించదగ్గ మహామనిషి కలాం

0
61
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  15 : అబ్దుల్‌ కలాం వంటి వ్యక్తులను తయారు చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను విరివిగా చేయడానికి ఆయన పేరుతో అసోషియేషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. అబ్దుల్‌  కలాం వెల్ఫేర్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ ఆరీఫ్‌ ఆధ్వర్యంలో ఈరోజు నెహ్రూనగర్‌ షాదీఖానాలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధులుగా సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడ్డి, కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జాతి గర్వించదగ్గ నేత కలాం అని, నీతి నిజాయితీలకు ఆయన నిలువుటద్దమన్నారు. ఈ సందర్భంగా పలు మున్సిపల్‌ పాఠశాలలకు చెందిన విద్యార్ధులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు, మెమోంటలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ హలీమ్‌, ఉపాధ్యక్షులు ఖురేషి, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ మఖ్భుల్‌, కోశాధికారి షేక్‌ మస్తాన్‌, సభ్యులు సయ్యద్‌ బాజీ, మహమ్మద్‌ రఫీ, మహమ్మద్‌ ఇలియాస్‌, అబ్దుల్‌ వలీ, అక్భర్‌ భాషా, ఆరీఫ్‌ భాషా,  హాజీ, అస్లాం, రఫీ, అన్వర్‌, జిలానీ, సయ్యద్‌ మున్నా, ఎస్‌ఎ హజీజ్‌, సయ్యద్‌ ఫయాజ్‌, సయ్యద్‌ మొయిన్‌, షేక్‌ ఇస్మాయల్‌, ఎండి జాని పాల్గొన్నారు.