కలాం జయంతి సందర్భంగా ఉచిత కంటి పరీక్షల శిబిరం 

0
42
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  15 : మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ సంస్కృతి ఆధ్వర్యంలో స్ధానిక హక్కుంపేట బొప్పన సావిత్రమ్మ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విద్యార్ధులకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. సంస్కృతి క్లబ్‌ అధ్యక్షులు లయన్‌ ప్రభాత్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి వైద్యులు సేవలందించారు. సుమారు 450 మంది విద్యార్ధినీ విద్యార్ధులకు     పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోన్‌ చైర్‌పర్సన్‌ కొల్లూరి గోపాలకృష్ణ, ఆర్‌సి లక్ష్మీప్రసాద్‌, ఎస్‌వివి సత్యనారాయణ, క్లబ్‌ కార్యదర్శి తాటిపాక శ్రీహరిరావు, బొప్పన కృష్ణమూర్తి, మాటూరి సిద్ధార్ధ, మాటూరి సౌమ్య, ఉంగరాల రామకృష్ణ, కాకి రామకృష్ణ, నాళం శివరామకృష్ణ, దేశాల నరసింహరావు (బాబి), కొండూరి మాణిక్యాలరావు పాల్గొన్నారు.