జాతి గర్వించదగ్గ నేత కలాం

0
43
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  15 : ప్రపంచ గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఒకరని,నేటి యువతకు ఆయన మార్గదర్శి అని మాజీ ఎమ్మెల్యే, వైకాపా సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు.కలాం జయంతి సందర్భంగా జాంపేటలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం ఉన్నత స్థితికి ఎదగడానికి నీతి, నిజాయితీ, పట్టుదల, ఆత్మవిశ్వాసమే కారణమన్నారు. శాస్త్రవేత్తగా ఎన్నో పరిశోధనలు చేసి మిస్సైల్స్‌ను కనిపెట్టారని, రాష్ట్రపతిగా భారతదేశానికి అత్యుత్తమ సేవలందించారని కొనియాడరు. తుది శ్వాస విడిచే వరకు దేశానికి సేవలందించారని,ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర చిన్ని, ఫ్లోర్‌లీడర్‌ షర్మిళారెడ్డి, పోలు కిరణ్‌రెడ్డి, బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల,ఆరీఫ్‌,వాకచర్ల కృష్ణ, దంగేటి వీరబాబు, మార్తి నాగేశ్వరరావు, రాజశేఖర్‌, కాటం రజనీకాంత్‌ పాల్గొన్నారు.