మాలమహానాడు జిల్లా అధ్యక్షునిగా బొచ్చా రమణ

0
82
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  15 : మాలమహానాడు జిల్లా అధ్యక్షునిగా క్వారీ ప్రాంతానికి చెందిన బొచ్చా రమణ నియమితులయ్యారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ స్థాపించిన మాలమహానాడు సంస్థను మరింత పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర రాజధాని అమరావతిలో భారీ స్థాయిలో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యు.రాజారావు, అజ్జరపు వాసు, కప్పల వెలుగు, తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి, పోలుపల్లి నాగేశ్వరరావు, పాము బాబూరావు, అర్ధాల కుమార్‌బాబు, గారా చంటి, తదితరులు పాల్గొన్నారు.