టిటి బోర్డులను ప్రారంభించిన ఆకుల వీర్రాజు 

0
54
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  16 : స్థానిక టౌన్‌హాలు ఎదురుగా గల టేబుల్‌ టెన్నిస్‌ కోచింగ్‌ సెంటర్‌కు ఎపిటిటిఏ అధ్యక్షులు, ఆడిటర్‌ వి.భాస్కర్‌రామ్‌ బహూకరించబడి సుమారు లక్ష రూపాయలు విలువ గల రెండు టిటి బోర్డులను వైఎస్‌ఆర్‌సిపి రాజమండ్రి రూరల్‌ కో ఆర్డినేటర్‌, టౌన్‌హాలు కార్యదర్శి ఆకుల వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకోవాలని, అనేకమంది టిడి క్రీడాకారులు రాజమండ్రి నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానం సంపాదించారన్నారు. క్రీడాకారులకు లక్షల రూపాయల క్రీడా సామాగ్రిని బహూకరించి ప్రోత్సహిస్తున్న భాస్కరరామ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన వంతు సహకారాన్ని కూడా అందిస్తానన్నారు. మరో ముఖ్యఅతిధి, యాక్షన్‌ స్వచ్చంద సంస్థ అధినేత గౌతమి టిటి అసోసియేషన్‌ అధ్యక్షులు మేడా గురుదత్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ టౌన్‌హాలులో టేబుల్‌ టెన్నిస్‌ ఆడిన అనేకమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ప్రతిభ కనబరిచి, విజయాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో గౌతమీ టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు బోనం వేణుగోపాలరావు, ఎపిటిటిఏ సహాయ కార్యదర్శి కె.సత్యనారాయణ పాల్గొన్నారు. ఎపిటిటిఏ ఉపాధ్యక్షులు జగన్నాధం అప్పారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోచ్‌ వి.టి.వి.సుబ్బారావు, సీనియర్‌ క్రీడాకారులు ఎన్‌.ఎస్‌.ఫల్గుణ్‌, ఎల్‌.ఎం.ఎస్‌.జయరాజ్‌, ఆచంట బాలాజీ, ఆచంట ఉమేష్‌కుమార్‌, పోతుల వీరభద్రరావు, అజిత్‌, వెంకటేష్‌, అనేకమంది క్రీడాకారులు పాల్గొన్నారు.