2018 జూన్‌ నాటికి పోలవరం పూర్తి

0
62
శ్రీవారి పాదాల చెంతన ప్రాజక్ట్‌ డిజైన్‌ పత్రాలు: మంత్రి దేవినేని
తిరుపతి, అక్టోబర్‌ 16 : పోలవరం ప్రాజక్ట్‌ను 2018 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజక్ట్‌ పూర్తిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజక్ట్‌ కీలకం కానుందని ఆయన అన్నారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దేవినేని పోలవరం ప్రాజక్ట్‌ డిజైన్‌ పత్రాలను వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతన ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్రం సహకారంతో ప్రాజక్ట్‌ పనులు వేగవంతంగా సాగుతున్నాయని,తరుచు ప్రాజక్ట్‌ పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. 48 గేట్లతో పోలవరం నమునాను రూపొందించామన్నారు. బహుళార్ధక సాధకమైన ఈ ప్రాజక్ట్‌కు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించి పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నామన్నారు.