ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

0
98
పోలీసు అమరవీరుల వారోత్సవాలలో ఉచిత వైద్య శిబిరం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 20 : శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టిసారించే పోలీసులు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సూచించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా వెంకటేశ్వరనగర్‌లోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాలులో ఈరోజు పోలీసులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్య నిపుణులు పోలీసులకు ఉచితంగా వైద్య సేవలందించారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ రాజకుమారి వైద్య పరీక్షలు చేయించుకుని మీడియాతో మాట్లాడారు. చాలామంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారని, ఫలితంగా నష్టాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ ఆర్‌.గంగాధరరావు, డిఎస్పీలు ప్రసన్నకుమార్‌, కె.రమేష్‌బాబు, అంబికా ప్రసాద్‌, కులశేఖర్‌, శ్రీకాంత్‌, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, నారాయణరావు, సత్యానందం, భరత్‌ మాతాజీ, సిఐలు సుబ్రహ్మణ్యేశ్వరరావు, రామకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.