వెండి పరిశ్రమలో అగ్నిప్రమాదం

0
185
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  21 : స్ధానిక చందా సత్రం వీధిలోని వెండి వస్తువుల తయారు చేసే పరిశ్రమలో ఈరోజు మధ్యాహ్నం గ్యాస్‌ సిలెండర్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది.గత ఎనిమిది సంవత్సరాలుగా అదే ప్రాంతంలో వెండి వస్తువులను తయారు చేస్తున్న రాజు అనే యజమాని  ఎప్పటి వలె ఈరోజు కూడా పరిశ్రమ తెరిచి పని చేసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. గ్యాస్‌ సిలెండర్‌ పేలుతుందనే భయంతో స్ధానికులు సైతం అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. స్ధానిక కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు అక్కడకు వెళ్ళి బాధితుడు రాజును పరామర్శించారు. ఆస్తి నష్టం వివరాలు తెలియవలసి ఉంది.