కాళ్ళ వాపు వ్యాధి నిర్ధారణ శిబిరం 

0
106
ఎవిస్‌ హాస్పటల్‌ ప్రయత్నానికి అభినందనలు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  23: కాళ్ళలో నరాల వాపు వ్యాధిపై ఈరోజు వై.జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో ఎవిస్‌ హాస్పటల్‌ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలకు చెందిన ప్రజలు ఉచిత వైద్య శిబిరానికి హాజరయ్యారు. ఎవిస్‌ హాస్పటల్‌ వైద్యులు, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజిస్ట్‌ డా. రాజా వి కొప్పాల, ప్రముఖ వైద్యులు డా.గౌతమ్‌ దెందుకూరి వైద్య సేవలందించారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా రోగులు తరలి వచ్చారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సిటీ ఎమ్మెల్యే డా. ఆకుల సత్యనారాయణ ప్రారంభించారు. సీసీసీ, రోటరీ క్లబ్‌, ఏపియూడబ్ల్యుజె ప్రతినిధులు ఈ వైద్య శిబిరానికి సహ కారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కాళ్ళలో నరాల వాపు వ్యాధి ఎక్కువగా ఉందని, అందుకోసం  ఈ ప్రాంతంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం ఉపయో గకరమన్నారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదని, ఎటువంటి వ్యాధులు సంక్రమించినా తక్షణమే చికిత్స చేయించుకోవాలన్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చి ఉచితంగా వైద్య సేవలందించిన ఎవిస్‌ హాస్పటల్‌ సేవలను ఆయన అభినందించారు. సీసీసీ ఎండి  పంతం కొండలరావు మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, రోజువారి కార్యక్రమాల్లో తప్పనిసరిగా గంట పాటు వ్యాయామం చేయాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎవిస్‌ హాస్పటల్‌ వైద్యులు మంచి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఈ  ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఏపీయూడబ్ల్యుజె నాయకులు మండెల శ్రీరామమూర్తి, జీఎ భూషణ్‌బాబు, ఎవిస్‌ హాస్పటల్‌ పీఆర్‌ఓ డి అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.