ఆదిత్యలో పరిశ్రమల స్ధాపనపై సెమినార్‌  

0
81
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  24 : నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌, పరిశ్రమల స్ధాపనపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌ను ప్రారంభించిన ఆదిత్య విద్యా సంస్ధల డైరక్టర్‌ ఎస్‌.పి.గంగిరెడ్డి మాట్లాడుతూ డిగ్రీలో మంచి మార్కులు తెచ్చుకున్నంత మాత్రాన ఉద్యోగాలు, పరిశ్రమలు స్ధాపించే నైపుణ్యం రావని, ఆ నైపుణ్యం కోసమే  ఆదిత్యలో తరుచు ఇటువంటి సెమినార్‌లు, సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.ఏదైనా పరిశ్రమలో ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే  ఆ పరిశ్రమకు సంబంధించిన టెక్నికల్‌, యాజమాన్య రీతులపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.బిక్కవోలులోని కెపిఆర్‌ ఆగ్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ ఎజిఎంకె కాళిదాస్‌ ఈ సెమినార్‌ను నిర్వహించారు. స్ధాపించుదలచుకున్న పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాలపై అవ గాహన ఉంటే ఎవరైనా పరిశ్రమలు స్ధాపించవచ్చన్నారు.అవగాహన, పట్టుదల ఉన్న విద్యార్ధులు పరిశ్రమలు స్ధాపించే విధంగా ఆలోచించాలన్నారు. అనంతరం సెమినార్‌లో చర్చించిన అంశాలపై పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ప్రిన్సిపాల్‌, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.