పోలీసులకు వైద్య పరీక్షలు

0
58
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  24 : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పీఎంపీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాష్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు దీనిని ప్రారంభించారు. శిబిరంలో నగరపాలక సంస్థ వైద్యాధికారి డాక్టర్‌ ఎం.వి.ఆర్‌.మూర్తి వైద్యసేవలందించారు. తూరు మండల పరిధిలోని 200 మంది పోలీసు సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రకాష్‌నగర్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టరు, ఎస్‌ఐలు బి.రామకృష్ణ, కె.నాగరాజు, వెంకటయ్య, పీఎంపీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు పి.దేవానందం, మట్టా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.