జాంపేట బ్యాంక్‌ ఎన్నికల్లో  గోరక్షణపేట దేవాంగ సంఘం పోటీ

0
50
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  24 : నవంబర్‌ 6న జరుగనున్న ది జాంపేట కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో ప్రస్తుత చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ తిరిగి పోటీచేయాలని, ఆయన బెల్టుకు పూర్తిమద్దతు నిచ్చి ఆయన బెల్టులో ఇద్దరు డైరెక్టర్లుగా పోటీచేయాలని గోరక్షణపేట దేవాంగ సంక్షేమ సంఘం తీర్మానించింది. సోమవారం ఉదయం స్థానిక గోరక్షణపేటలోని సంఘ కార్యాలయంలో సంఘం అధ్యక్షులు బళ్ళా శ్రీనివాస్‌ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. దేవాంగ ప్రముఖులచే స్థాపించి, నిర్వహించబడుతున్న జాంపేట బ్యాంకుకు నగరంలో బలీయంగావున్న గోరక్షణపేట దేవాంగ సంఘం తరుపున సంఘం అధ్యక్షుడు బళ్ళా శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు ఆశపు శేఖర్‌లు పోటీచేయాలని, బొమ్మన బెల్టులో ఆ ఇరువురికి అవకాశం ఇవ్వాలని కోరుతూ తీర్మానించారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ సలహాదారులు పడాల వీరభద్రరావు, సహాయ కార్యదర్శులు కటకం విశ్వనాధరావు, ముప్పన కుమారస్వామి, కార్యవర్గ సభ్యులు అల్లంకి వీరవెంకట సత్యనారాయణ, జిడగం భానుప్రసాద్‌, యర్రా నాగేశ్వరరావు, కొడమటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.