గౌడ, శెట్టిబలిజ సంఘం జిల్లా కన్వీనర్‌గా కుడుపూడి పార్థసారధి 

0
193
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  24 : గౌడ, శెట్టిబలిజ సంఘం తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్‌గా కుడుపూడి పార్ధసారధి నియమితులయ్యారు. గౌడ సంఘం రాష్ట్ర కో కన్వీనర్‌, మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శాసనమండలి సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు కుడిపూడి చిట్టబ్బాయి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గౌడ సంఘ రాష్ట్ర మాజీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావుల సమక్షంలో ఉభయగోదావరి జిల్లాల గౌడ, శెట్టిబలిజ సంఘం ప్రతినిధులు ఈ మేరకు నియామకాన్ని ప్రకటించారు. రాజమహేంద్రవరంలోని హోటల్‌ ఆనంద్‌ రీజెన్సీలో జరిగిన జిల్లా గౌడ శెట్టిబలిజ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం చేశారని గౌడ శెట్టిబలిజ సంఘం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి, రాజమహేంద్రవరం ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ సూరంపూడి శ్రీహరి తెలిపారు. ఈ సమూవేశంలో రాష్ట్ర బిసి ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పెచ్చేటి చంద్రమౌళి, అమలాపురం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పెచ్చేటి విజయలక్ష్మి, కాంగ్రెస్‌ పార్టీ బిసి సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ నులుకుర్తి వెంకటేశ్వరరావు, బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లంగి వేణుగోపాల్‌, హితకారిణి సమాజం మాజీ చైర్మన్‌ బుడ్డిగ శ్రీనివాస్‌, భారత్‌ మజ్దూర్‌ సంఘ్‌ కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, రాజమహేంద్రవరం గౌడశెట్టి బలిజ సంఘం అధ్యక్షులు రెడ్డి రాజు,  రామచంద్రపురం తాలూకా శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు కట్టా సూర్యనారాయణ, కాకినాడ పార్లమెంట్‌ శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు వనుము రాజబాబు, ట్రైపాటి కమిటీ మాజీ మెంబర్‌ రెడ్డి రామపళ్ళంరాజు, గౌడ, శెట్టిబలిజ సంఘం నాయకులు కుడిపూడి సత్తిబాబు, మార్గాని రామకృష్ణగౌడ్‌, అయినవిల్లి ఉదయభాస్కర్‌, మార్గాని చంటి, కడలి వెంకటేశ్వరరావు, బు బుడ్డిగ రవి, దొమ్మేటి మురళీకృష్ణ, ఇళ్ళ శివప్రసాద్‌, పశ్చిమగోదావరి జిల్లా సంఘం కన్వీనర్‌ పాకా సత్యనారాయణ, వేండ్ర వెంకటస్వామి, పాలిక శ్రీను,  కుడిపూడి శాంతిభూషణ్‌, గేడి రాజు, కడియాల వరబాబు, కోడి ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, పాలిక వెంకట దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గౌడశెట్టిబలిజ  సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు. త్వరలోనే జిల్లావ్యాప్తంగా సంఘం బలోసపేతానికి సమావేశాలు కిందస్థాయి నుంచి నిర్వహించుకోవాలని సమావేశం నిర్ణయించింది.