కాలుష్యంపై కళాజాత ప్రచారం

0
99
దీపావళి పండుగ నేపధ్యంలో కాలుష్య నియంత్రణ మండలి చొరవ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  24: మరో ఆరు రోజుల్లో దీపావళి పండుగ వచ్చేస్తోంది…పిల్లలందరికీ సరదా పండుగైన దీపావళి వెలుగులతో పాటు కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని వెదజల్లుతుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్న నేపధ్యంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు  ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జనజాగృతి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా బుర్రకథ ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు వి.లోవరాజు ఆధ్వర్యంలో  బుర్రకథ ప్రచారాన్ని చేపట్టారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ తన కార్యాలయం వద్ద ఈరోజు ఆ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలా ఉండగా ప్రతి సోమవారం సబ్‌ కలెక్టర్‌ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.