ఘనంగా ముత్యాల శారదాంబ జాతర

0
65
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  28 : అశోక ధియేటర్‌ సమీపంలోని పాత బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ముత్యాల శారదాంబ జాతర ఘనంగా జరిగింది. 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, అప్పారావు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. గరగ నృత్యం, కోలాటం, బ్యాండు మేళాలు, శక్తి వేషాలతో జాతర ఉత్సవం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.