ప్రభుత్వానికి స్వచ్చంధ సంస్ధలు బాసటగా నిలవాలి

0
64
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  29 : ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్ధలు, దాతలు ముందుకు వస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు.  స్ధానిక 22 వ డివిజన్‌లోని పద్మావతి ఘాట్‌ను కార్పొరేటర్‌ మాటూరి రంగారావుతో  కలిసి గన్ని ఈరోజు పరిశీలించారు. సిద్ధార్ధ ప్లైవుడ్స్‌ సహకారంతో ఆ ఘాట్‌లో షవర్‌బాత్‌ను ఏర్పాటు చేశారు. ఘాట్‌ను ఎప్పుటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు పైప్‌లైన్‌ను నిర్మించారు. దాదాపు రూ.  30 వేలతో ఘాట్‌లో ఈ షవర్‌బాత్‌ను, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు రంగారావు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి దాతలు ముందుకొస్తే  నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. అంతకు ముందు 23 వ డివిజన్‌ కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబుతో కలిసి టిటిడి ఘాట్‌ను పరిశీలించి అక్కడ జరుగుతున్న కార్తీక మాస ఏర్పాట్లపై ఆరా తీశారు. గన్ని వెంట దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, శెట్టి జగదీష్‌, మద్ది నారాయణరావు, ఉప్పులూరి జానకిరామయ్య, కాట్రు లక్ష్మణస్వామి, కాట్రు రమణకుమారి, ముత్య సత్తిబాబు, డి.ఇ. వీరభద్రరావు  ఉన్నారు.