బిజెపి ఆధ్వర్యంలో పటేల్‌ జయంతి 

0
96
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  31 : భారత్‌ తొలి మాజీ ఉప ప్రధాని, సంస్థానాల విలీనంలో కీలక పాత్ర వహించిన ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు బిజెపి నగర శాఖ అధ్యక్షులు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత్‌లో 565 సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్‌ వహించిన పాత్రను దత్తు ఈ సందర్భంగా వివరించారు. అంతటి ఉక్కు సంకల్పం ఉన్న నేతను తిరిగి నేడు ప్రధాని నరేంద్రమోడీ రూపంలో చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు  బూర రామచంద్రరావు, దాస్యం ప్రసాద్‌, రేలంగి శ్రీదేవి, సత్తి మూలారెడ్డి, నల్లమిల్లి బ్రహ్మానందం, కెవిఎం కృష్ణ,  తక్కెళ్ళ సత్యనారాయణ, పైలా సుబ్బారావు, తంగెళ్ళ శ్రీనివాస్‌, పిల్లి మణెమ్మ, నందివాడ సత్యనారాయణ, పిల్లాడి రుద్రయ్య, వెత్సా రాంప్రసాద్‌, చోరపల్లి రామకృష్ణ, జివి రత్నారెడ్డి, మచ్చా సత్యవతి, కుమ్మరపురుగు వెంకట రమణరావు,టేకి శంకర్‌, వాడ్రేవు పాప, వారాది సతీష్‌, కె.మహలక్ష్మీ, మడగల మూర్తి,కిషోర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.