కళ్ళున్న కబోధి…..అభివృద్ధి నిరోధకుడు

0
199
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌పై తెదేపా మండిపాటు
నగరంలో జన చైతన్య యాత్రలకు శ్రీకారం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 2 : ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయకుండా, మరో వైపు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి కళ్ళున్న కబోధిలా వ్యవహరిస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమహేంద్రవరం సిటీ నియోజకరవర్గ తెదేపా ఇన్‌ఛార్జి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈరోజు 37 వ డివిజన్‌ నుంచి జన చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టారు. ముందుగా డివిజన్‌ కార్పొరేటర్‌ పెనుగొండ విజయభారతి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. పార్టీ పతాకాన్ని నిమ్మల రామానాయుడు ఆవిష్కరించి ప్రసంగించారు. తెదేపా అధికారం చేపట్టి రెండున్నరరేళ్ళు కావోస్తోందని, ఇంతవరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే జన చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నామన్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాలు చేయలేని విధంగా రైతు రుణమాఫీని లోటు బడ్జెట్‌ ఉన్న ఏపీలో అమలు చేయడం చంద్రబాబు సమర్ధతకు నిదర్శనమన్నారు. ఎన్‌టిఆర్‌ వైద్య సేవ, నిరంతర విద్యుత్‌ సరఫరా, ప్రతి నెలా క్రమం తప్పకుండా ఫించన్ల పంపిణీ, పోలవరం ప్రాజక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారని, ఇవేమీ ప్రతిపక్ష నేత జగన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్‌ ఎజెండా అని విమర్శించారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ సుశిక్షితులైన తెలుగుదేశం కార్యకర్తల సైన్యం సమాయత్తమవుతోందని, జన చైతన్య యాత్రలతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర విభజన చేసి ఏపీకి అన్యాయం చేసిన నాయకులు ఇపుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం సిగ్గుచేటన్నారు.  అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి కోట్లు కూడబెట్టిన నాయకులు ఇపుడు గడపగడపకు అంటూ తిరుగుతున్నారని, వారిని నిలదీయాలని పిలుపు ఇచ్చారు. చంద్రన్న బీమా పథకంలో ప్రతి ఒక్కరూ చేరాలని, పేద మధ్యతరగతి ప్రజలకు ఇది సంజీవని వంటిదన్నారు. జన చైతన్య యాత్రలు ప్రచారానికి పరిమితం కాకూడదని, పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకం కావాలన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ జన చైతన్య యాత్రలు బల ప్రదర్శన కోసం కాదని, ఆర్భాటాలకు తావు లేకుండా ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు కృషిని వివరించాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ లోటు బడ్జెట్‌ ఉన్నా  ఫించన్ల పంపిణీ, నిత్యవసరాల పంపిణీ, సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదన్నారు. ప్రజా సంక్షేమం,  రాష్ట్ర అభివృద్ధి రెండు కళ్ళుగా చంద్రబాబు పనిచేస్తున్నారని, గడప గడపకు వస్తూ అసత్యాలు  వ ల్లిస్తున్న వైకాపా నేతలు బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా గోరట్ల,  గన్ని , ఆదిరెడ్డి, వాసిరెడ్డి, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌లు తమ సభ్యత్వాలను నమోదు చేయించుకోవాలన్నారు. సభానంతరం ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, తెదేపా నేత గన్ని, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి తెదేపా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. డివిజన్‌లో డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్సీ ఆదిరెడ్డి,  గన్ని దృష్టికి కార్పొరేటర్‌ విజయభారతి తీసుకొచ్చారు.  ఈ కార్యక్రమంలో మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్‌, కోసూరి చండీప్రియ, పైడిమళ్ళ మెర్సీప్రియ, మళ్ళ నాగలక్ష్మీ,మర్రి దుర్గాశ్రీనివాస్‌, గరగ పార్వతి, పల్లి శ్రీనివాస్‌, మానుపాటి తాతారావు, బూర దుర్గాంజనేయరావు, కో ఆప్షన్‌ సభ్యులు చాన్‌భాషా, కప్పల వెలుగు, మజ్జి పద్మ, పార్టీ నాయకులు కురగంటి సతీష్‌, రెడ్డి మణి, రాచపల్లి ప్రసాద్‌, మార్ని వాసు, మానే దొరబాబు, యార్లగడ్డ శేఖర్‌, హుస్సేన్‌ ఆలీ జానీ, మళ్ళ వెంకట్రాజు, మజ్జి రాంబాబు, బెజవాడ వెంకటస్వామి, ఉప్పులూరి జానకిరామయ్య, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, ఎస్‌.రాజారావు, ప్రవీణ్‌చౌదరి, మొల్లి చిన్ని యాదవ్‌, పెనుగొండ రామకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్‌, దూడల త్రినాధ్‌, శీలం గోవింద్‌, విక్రమ్‌ సందీప్‌ చౌదరి, అడ్డగర్ల ఆనంద్‌, తలారి భాస్కర్‌, గరగ మురళీకృష్ణ, గొర్రెల సత్యరమణి, తీడా నర్సింహమూర్తి, సూరంపూడి  శ్రీహరి, పోలాకి పరమేష్‌, కర్రి రాంబాబు, మేరపురెడి ్డ రామకృష్ణ, సింహాద్రి సతీష్‌, పురెడ్ల శేషుకుమార్‌ రెడ్డి, చిన్నారి ఉమామహేశ్వరరావు, బర్ల గిరిజ, పిన్నింటి రవిశంకర్‌,మేడిశెట్టి కృష్ణారావు,  జాగు వెంకటరమణ, వారాది హనుమంతరావు, టేకుమూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.