గుడాకు రూపురేఖలు

0
92
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 3 : గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణీకరణను వేగవంతం చేసేందుకు ఉద్ధేశించిన ఈ అథారిటీకి ఈ జీఓ ద్వారా ప్రభుత్వం ఓ రూపం  ఇచ్చింది. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలను కలుపుతూ  పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ….పట్టణ,గ్రామీణ ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గుడా ఏర్పాటు చేసింది.గుడా పరిధిలోకి కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లతో పాటు పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘాలతో పాటు గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయితీలు, జిల్లాలోని 17 మండలాల్లోని 190 గ్రామాలు ఈ గుడా పరిధిలోకి వచ్చాయి. దాదాపు 1200 చదరపు కిలోమీటర్ల పరిధిలో
విస్తరించి ఉన్న గుడా పరిధిలో పట్టణ జనాభా 8.77 లక్ష లు, గ్రామీణ జనాభా 8.77 లక్షలు ఉన్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్‌ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే  30 రోజుల్లోగా ఆయా పట్టణ, గ్రామాల ప్రజలు తెలియజేయవచ్చు. వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. కాగా గుడా కాకినాడ ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది.