జూపూడి భరత్‌ మృతికి డా. గన్ని భాస్కరావు, గన్ని కృష్ణ సంతాపం

0
81
రాజమహేంద్రవరం, నవంబర్‌ 3 :  స్మైల్‌ డెంటల్‌ హాస్పటల్‌ అధినేత డాక్టర్‌ జూపూడి భరత్‌ హఠాన్మరణానికి పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భరత్‌ మృతి పట్ల జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల, ఆసుపత్రి చైర్మన్‌, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మెంబర్‌ డాక్టర్‌  గన్ని భాస్కరరావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు. కాగా డా.భరత్‌ కుటుంబ సభ్యులను ఈరోజు ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, వ్యాపార ప్రముఖులు జెట్టి ప్రసాదరావు,  రామానుజదాస్‌ బంగ్‌, కొల్లేపల్లి శేషయ్య, నిమ్మలపూడి గోవింద్‌ తదితరులు పరామర్శించి తమ సానుభూతి తెలిపారు