జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరిన పోలు విజయలక్ష్మీ బృందం

0
289
రాజమహేంద్రవరం, నవంబర్‌ 4 : నగర పాలక మండలిలో మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మీతో సహ పలువురు ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండులో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో వారు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు సారధ్యంలో వీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పోలు విజయలక్ష్మీతో పాటు  మాజీ కార్పొరేటర్‌ తామాడ సుశీల, జాంపేట మార్కెట్‌ కమిటీ  అధ్యక్షుడు తలశెట్ల నాగరాజు, 29 వ  డివిజన్‌ తెదేపా మాజీ అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు తదితరులు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరందరికి జగన్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు సమిష్టిగా పనిచేయాలని వారికి సూచించారు.